![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -626 లో.. దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని తెలిసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే శౌర్య వస్తుంది. అమ్మ మీరు ఎప్పుడు వచ్చారు.. లోపల నా చెల్లి ఎలా ఉందని అడుగుతుంది. బాగుందని దీప చెప్తుంది. అనసూయ వెళ్లి స్వీట్ తీసుకొని రా అని శ్రీధర్ అనగానే అనసూయ స్వీట్ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఆ తర్వాత అమ్మ అని దీపని శౌర్య లాగుతుంది. అమ్మ అని దీప నొప్పితో బాధపడుతుంటే ఏమైంది దీపకి అని శ్రీధర్ అడుగుతుంది. మరొకవైపు అక్కడ జరుగుతుంది అంత జ్యోత్స్నకి పారిజాతం వీడియో కాల్ చేసి చూపిస్తుంది. దీప ఏంటి నాలాగా నడుస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు కావేరి ఇంటికి దాస్ స్వీట్ బాక్స్ తో వస్తాడు. సుమిత్ర వదిన ఇప్పుడు బాగైంది. మరొక గుడ్ న్యూస్ దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని దాస్ అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. స్వప్నకి పెళ్లి చెయ్యాలని శ్రీధర్ బావ నేను ఒక సంబంధం చూశామని దాస్ చెప్పగానే స్వప్న, దాస్, కావేరి,కాశీ షాక్ అవుతారు. మరొకవైపు పారిజాతం వీడియో కాల్ లో ఉండగా అప్పుడే శివన్నారాయణ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు.
పాపం కాంచనని ఓదార్చడానికి వచ్చాను కానీ దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉందట.. వాళ్ళు సంతోషంగా ఉంటే దూరం నుండి చూస్తున్నానని పారిజాతం అనగానే శివన్నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కార్తీక్ వచ్చి అవును తాత అంటాడు. అందరు లోపలికి వెళ్తారు. దీప రా అని పారిజాతం లాక్కొని వెళ్తుంటే.. అమ్మ నొప్పి అని మళ్ళీ దీప ఇబ్బంది పడుతుంది. బిడ్డ నీ కడుపులో ఉంది ఏ ఆపరేషన్ కాలేదు. మరి దీప ఎందుకు అలా నడుస్తుందని పారిజాతం అడుగుతుంది. అవునురా దీపకి ఏమైంది అని కాంచన అడుగుతుంది. ఏం లేదు దీప ఆపరేషన్ థియేటర్ కి వెళ్తుంటే కింద పడింది.. బిడ్డ మాతోనే ఉండాలని అనుకుంటుందని బిడ్డని వద్దు అనుకునే నిర్ణయం మార్చుకున్నామని కార్తీక్ చెప్పగానే అంతే కదా మళ్ళీ ఏంటో అనుకున్నానని కాంచన అంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న ఎవరికో కాల్ చేసి రిపోర్ట్స్ త్వరగా రావాలని చెప్తుంది. ఈ రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది. నేను సుమిత్ర కూతురు కాదో అవునోనని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి మాట్లాడుతుంది. నువ్వు హాస్పిటల్ లో దీప గది ముందే ఉన్నావా అని అడుగుతుంది. ఒక అయిదు నిముషాలు లేనని పారిజాతం అనగానే జీవితాలు తలకిందలు కావడానికి ఒక అయిదు నిముషాలు చాలని జ్యోత్స్న తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |